ఖమ్మం: పట్టణంలోని బైపాస్ రోడ్‌లో యూరియా లారీ దగ్ధమయ్యింది. యూరియా లోడ్‌తో ఓ లారీ ఖమ్మం పట్టణానికి వచ్చింది. అయితే అడ్రస్ కోసం బైపాస్ రోడ్డులో డ్రైవర్ లారీని ఆపాడు. ఈ క్రమంలో ఇంజిన్‌లో ఏర్పడిన లోపం వల్ల షార్ట్‌సర్క్యూట్ అయ్యింది. దీంతో మంటలు క్యాబిన్‌లోకి వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే లారీలోనుంచి దూకేశాడు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌తోపాటు, కొన్ని యూరియా బస్తాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm