హైదరాబాద్: రైల్వే ట్రాక్ దాటేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు దూరంగా ఉందిలే అనే ధీమాతో పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తే.. క్షణాల్లో ప్రాణాలు పోతాయ్. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఈ వీడియోలో మహిళ రెండు తప్పులు చేసింది. ఒకటి.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటడం. రెండోది.. రైలు వచ్చే లోపే పట్టాలు దాటేద్దామనే కంగారు ఆమె మరణానికి కారణమయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటుచేసుకుంది. హెల్త్ వర్కర్‌గా పని చేస్తున్న మహిళ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.
Mon Jan 19, 2015 06:51 pm