హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ మాతా ప్రసాద్ (95) కన్నుమూశారు. యూపీ లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఎం)లో బహుళ అవయవాల వైఫల్యంతో మరణించారు. బుధవారం సాయంత్రం ఆయనను ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు ఎస్‌జీపీజీఎంకు తరలించినట్లు ఓ అధికారి తెలిపారు. ఆయన మృతిపై అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండు సంతాపం ప్రకటించారు. ‘దేశం అంకితభావంతో పని చేసే, హృదయపూర్వక అడ్మినిస్ట్రేటర్‌ను కోల్పోయిందన్నారు. మాతా ప్రసాద్ 1988- 89లో ఉత్తర ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1993లో అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియామకమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm