హైదరాబాద్: వనపర్తి జిల్లాలో పల్లి పంటకు డిమాండ్ బాగా పెరిగింది. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజులుగా రూ. 7 వేలకు పైగా ధర పలకగా... బుధవారం గరిష్ఠంగా రూ. 7 వేల 971 పలికింది. రోజురోజుకూ ధరలు క్రమంగా పెరుగుతుండటం రైతులకు ఊరటనిస్తోంది. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో పలికిన రేటు కంటే వనపర్తిలోనే అధిక ధర ఉంది. పల్లికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 5,275 కాగా... ఈ సారి దాదాపుగా గరిష్ఠ ధర రూ. 8 వేలకు పలుకుతోంది. అధిక ధరలు పలకడం గిట్టుబాటు అవుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిని, తెగుళ్లు సోకి, పెట్టుబడులు అధికమయ్యాయని... దిగుబడులు తగ్గాయని... ఈ సమయంలో రేటు పలకడం మంచిదేనని రైతులు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm