హైదరాబాద్: ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద వేతన సవరణ కోసం నిరాహార దీక్ష చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ప్రకటించింది. ముగ్గురు అధికారులతో పీఆర్సీ కమిటీ వేస్తే.. నివేదిక కోసమే 32 నెలలు పట్టిందని, ఎన్నో ఒత్తిళ్లు, పోరాటాల ఫలితంగా నివేదిక సమర్పించి 20 రోజులైనా నివేదిక సీలు తెరవలేదని జేఏసీ ఛైర్మన్ కె.లక్ష్మయ్య మండిపడ్డారు. వెంటనే నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల ముందు భోజన విరామ సమయంలో నిరసనలు వ్యక్తం చేయాలని, ఇందులో పెన్షనర్లంతా విధిగా పాల్గొనాలని ఆయన కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm