హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని సీఐటీయ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జీబు జాత చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రోఫెసర్ నాగేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయలని సమరశీలంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీ సారుహద్దులో ఎముకలు కొరికే చలిలో పట్టుదలతో పోరాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 50 మంది చనిపోయారని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్ లుగా చేశారని, విద్యుత్ సవరణ బిల్లు 2020 తెచ్చి కార్మిక ప్రజల హక్కులను హరించి యజమానులకు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించారని విమర్శించారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చారాని.. సమ్మె చేసే హక్కును హరించే విధంగా కోడ్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరణ చేసి కాంట్రాక్టు వ్యవసాయానికి తెర తీసి దేశ ఆహార భద్రత ప్రమాదంలోకి నెట్టిందని అన్నారు. ఈ మూడు వ్యవసాయ చట్టాల వల్ల దేశ ప్రజానీకం ప్రమాదంలోకి నెట్టిందని, వెంటనే ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయ రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్, పి.శ్రీకాంత్, పద్మశ్రీ, సీఐటీయ నగర్ కార్యదర్శి ఎం.వెంకటేష్, అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ఆఫీస్ బేరర్,జె.కుమారస్వామి కె.రమేష్, ఆర్.మల్లేష్, ఎం. సత్యనారాయణ, నాయకులు, జాకీర్, జి. రాములు, శ్రీరాములు, పి.వెంకటయ్య సి.మల్లయ్య, కె.రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Jan,2021 05:27PM