హైదరాబాద్ : తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అనే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై కొంతమంది నాయకులు ఇప్పటికే స్పందించారు. కేటీఆర్ సీఎం న్యూస్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంది అని ప్రశ్నించారు. తగిన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆరేళ్ళ పరిపాలన సమయంలో సీఎం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక కాళేశ్వరంపై కామెంట్లు చేసిన బీజేపీ నేతలపై మంత్రి తలసాని సీరియస్ అయ్యారు. అవగాహనా లేకుండా కాళేశ్వరంపై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. గత 70 ఏళ్లుగా తెలంగాణ ఎడారిగా ఉందని, తెలంగాణకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. గతంలో నీళ్లు లేక తెలంగాణ రైతులు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి బాధలు లేవని, రైతులు సంతోషంగా పంటలు వేసుకుంటున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి తలసాని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm