హైదరాబాద్ : కర్నాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ కు చేదు అనుభవం ఎదురైంది. బీసీ పాటిల్‌ను రైతులు అడ్డుకుని తమ సమస్యలు తీర్చాలంటూ నిలదీశారు. మైసూరులోని జలదర్శిని సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మంత్రిని పలువురు రైతులు చుట్టుముట్టారు. తమ సమస్యల పరిష్కారంపై ఆయనను ప్రశ్నించారు. పరిశీలిస్తామని చెప్పడంతో ఇంకా ఎంత కాలం అన్ని నిలదీశారు. అనంతరం మంత్రికి, పభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఊహించని ఈ పరిణామంతో మంత్రి బీసీ పాటిల్ కంగుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm