హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.. ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది.. మళ్లీ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు భూమా అఖిలప్రియ. ఆమె ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు అఖిల ప్రియ తరపు న్యాయవాదులు. దీంతో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులకు నోటీసులు జారీ చేసింది సెషన్స్ కోర్టు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm