↗️ Labuschagne moves to No.3
— ICC (@ICC) January 20, 2021
↗️ Root enters top five
↗️ Pujara moves up one spot to No.7
The latest @MRFWorldwide ICC Test Player Rankings for batting are out!
Full rankings: https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/49DbXmXznS
హైదరాబాద్ : ఐసీసీ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాట్స్మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ మళ్లీ ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని, ఆసీస్ స్టార్ స్మిత్ రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. లబుషేన్ (ఆసీస్) ఓ స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. ప్రస్తుతం విలియమ్సన్ 919 పాయింట్లతో ఉండగా, స్మిత్ 891, లబుషేన్ 878, కోహ్లీ 862 పాయింట్లతో కొనసాగుతున్నారు. అలాగే టీమ్ఇండియా ఆటగాళ్లు పుజారా ఒకస్థానం మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరగా రహానె రెండు స్థానాలు కోల్పోయి 9కి పడిపోయాడు.
బౌలింగ్ విభాగంలో.. ఓ స్థానం మెరుగుపరుచుకుని టీమ్ఇండియా క్రికెటర్ అశ్విన్ 760 పాయింట్లతో 8, 757 పాయింట్లతో బుమ్రా 9వ ర్యాంకుకు చేరుకున్నారు. కమిన్స్(ఆసీస్), బ్రాడ్(ఇంగ్లాండ్), వాగ్నర్(న్యూజిలాండ్) వరుసగా టాప్-3లో ఉన్నారు. ఆల్ రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా 3వ స్థానంలో కొనసాగతున్నాడు.