హైదరాబాద్ : ఓ ఎంపీ అనుచరులు టోల్ ప్లాజా వద్ద హల్ చల్ చేశారు. టోల్ ప్లాజా సిబ్బందిపై అరుస్తూ వారితో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఫర్నీచర్ ధ్వంసం చేసారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్‌ప్లాజా దగ్గర చోటుచేసుకుంది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన ఎంపీ హనుమాన్ బేనివాల్ తన అనుచరులతో కలిసి కార్లలో వెళ్తుండగా షాజహాన్‌పూర్ టోల్‌ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారు. అయితే, కారులో ఉన్నదని ఎంపీ హనుమాన్ బేనివాల్ అని తెలుసుకుని అతని కారుకు దారిచ్చారు. అయితే వెనుక కార్లలో ఉన్నది అతని అనుచరులే అని తెలియక ఆ కార్లను ఆపినా, విషయం తెలుసుకుని వదిలేశారు. దాంతో ఎంపీ అనుచరులు కార్లలోంచి దిగి టోల్ సిబ్బందిపై దరుసుగా వ్యవహరించారు. టోల్ బూత్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm