హైదరాబాద్ : ఉత్తర భారతంలో భారీగా పొగమంచు అలుముకుంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో వరుసగా ఉష్ణోగ్రత 9.4, 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది. దట్టమైన పొగమంచు కారణంగా 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తెలిపారు. పాలం, అమృత్‌సర్, లక్నో, వారణాసి, పాట్నా విమానాశ్రయాల్లోనూ తక్కువ దృశ్యమానత నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు రోజుల్లో వాయువ్య భారతంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఈ నెల 22 నుంచి విస్తృతంగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని, బీహార్‌లోనూ రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm