హైదరాబాద్: ఇంటి బయట పార్క్ చేసి వదిలేసే బైకులు లేదా స్కూటర్లను నడపడానికి ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇలా అనుకోని అతిథి అకస్మాత్తుగా వచ్చి హడలగొట్టే ప్రమాదం ఉంది. ఒడిశాలోని బాలకటిలో నాగుపాము బైకు ప్యానెల్‌లోకి దూరింది. సీటు కింద ఏదో మెరుస్తూ కనిపించడంతో అప్రమత్తమైన బైకర్ సైడ్ ప్యానెల్ తొలగించి చూసి షాకయ్యాడు. అందులో నాలుగు అడుగుల నాగుపాము దాక్కొని ఉంది. దీంతో అతడు వెంటనే పాములను పట్టుకొనే వ్యక్తిని పిలిచాడు. బైకు నుంచి తీసిన పామును అడవుల్లోకి వదిలిపెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm