హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలో 50కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నార్సింగి సీఐ గంగాధర్ తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో కోకాపేట వద్ద వాహన తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నానక్రామ్ గూడ నుంచి కోకాపేట వైపు వస్తున్న ఓ కారులో భారీగా గంజాయిని గుర్తించినట్లు వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్న దుర్గేష్, సంతోష్ అనే ఇద్దరు నిందితుల అరెస్టు చేసి, కారును సీజ్ చేసినట్లు తెలిపారు. చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టి వాటిని విక్రయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. వీరిపై గతంలోనూ అక్రమంగా గంజాయి తరలింపు కేసులు ఉన్నాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm