హైదరాబాద్: జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి బోసు రాజ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాబాద్, రంగారెడ్డి స్థానానికి పరిశీలనలో చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సంపత్ పేర్లు ఉన్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి పరిశీలనలో రాములు నాయక్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్ పేర్లను కాంగ్రెస్ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm