- పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు
హైదరాబాద్: రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయి. లీటర్ పెట్రోల్ అసలు ధర రు.28.50 కాగా వివిధ పన్నుల పేరుతో రు.88.63లకు మరియు లీటర్ డీజిల్ అసలు ధర రు.29.53 కాగా రు.81.99లకు హైదరాబాదులో అమ్ముతున్నారు. 2014లో నరేంద్రమోడి అధికారానికొచ్చేనాటికి లీటర్ పెట్రోల్‌పై రు.9.48 ఉన్న కేంద్ర పన్నును నేడు రు.32.98లకు, లీటర్ డీజిల్‌పై రు.3.56 ఉన్న కేంద్ర పన్నును రు.31.83లకు బీజేపీ ప్రభుత్వం పెంచి సామాన్య ప్రజలపై భారాలు వేసింది. తక్షణమే పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు వెంటనే తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ఆయిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా రంగంతో పాటు, నిర్మాణ రంగానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగంలో ముడిసరుకుల రేట్లు విపరీతంగా పెరగడంతో పనులు ఆగిపోయి కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. లాక్‌డౌన్ కాలంలో ప్రపంచంలో అయిల్ ధరలు జీరో స్థాయికి పడిపోయినా కూడా ధరలు తగ్గించకుండా ఆయిల్ కంపెనీలు, కేంద్రం రు.10 లక్షల కోట్లు తన ఖజానాలో వేసుకున్నాయి. ప్రధానమంత్రి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల దేశ ప్రజానీకానికి కష్టాలు, కడగండ్లు తెచ్చిపెట్టారు. దీన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నట్లు మోడీ నటిస్తున్నారు తప్ప ప్రజల కన్నీరు తుడిచేందుకు కాదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడి అయిల్ మూల ధరపై వేస్తున్న ప్రస్తుత రేట్లను తగ్గించాలి. దీని ద్వారా నిర్మాణరంగం పుంజుకోవడమే కాకుండా, నిత్యావసరాలు ప్రజలు కొనేందుకు అందుబాటు ధరల్లో వుంటాయి. ప్రజలపై పడుతున్న ఈ భారాలను తగ్గించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు మరియు ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2021 05:58PM