హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఈరోజు రాజ్ భవన్ ఘెరవ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ ను తలపెట్టింది. రాజ్ భవన్ కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలివస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుందని, ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మోడీవైపు ఉంటారా లేదంటే రైతుల వైపు ఉంటారో తేలిపోతుందని అన్నారు. బీజేపీ, తెరాస పార్టీలు తోడు దొంగలని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మోడీకి, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, ఆధాని, అంబానీ, అమెజాన్ కంపెనీల కోసం మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేత విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm