హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో పోడిచి చంపేశాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన యువతి గాయత్రి (20) మంగళవారం తమ బంధువుల అమ్మాయితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తోంది. పోతనపెట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీబాబు ఆమెను ఎంపరాళ్ల కొత్తూరు వద్ద అడ్డగించి కత్తితో దారుణంగా పోడిచాడు. దీంతో తీవ్ర గాయాలైన యువతిని బంధువులు పెనుమూరు పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తీసుకెళ్తుండగా గాయత్రి మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు పరారీలో ఉన్నాడని స్థానిక పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm