హైదరాబాద్ : అఫ్గానిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సాయుధుడైన ఓ వ్యక్తి దేశ రాజధాని కాబూల్‌లోని హైకోర్టులో పని చేస్తున్న ఇద్దరు మహిళా జడ్జీలను ఆదివారం కాల్చి చంపాడు. జడ్జీలిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా, కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరణించిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పనిచేస్తున్నవారేనని ధ్రువీకరించారు. అయితే వారి పేర్లను, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
Mon Jan 19, 2015 06:51 pm