హైదరాబాద్ : ఏపీలో 24 గంటల్లో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 27,861 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,141కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 263 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm