హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అవినీతి బయటపడే రోజులు దగ్గరపడ్డాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తనతో చర్చకు వస్తే.. గణాంకాలతో సహా నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 16 టీఎంసీల నీటికే భూగర్భ జలాలు పెరిగితే.. నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కింద ఎంత మేర భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రశ్నించారు. వనపర్తి, సంగారెడ్డి ప్రాంతాల్లో భూ గర్భ జలాలు బాగా పెరిగాయన్న ఆయన.. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందా అని నిలదీశారు. సామాన్య ప్రజలను నమ్మించేందుకే తూ తూ మంత్రంగా నీటిని పంపింగ్ చేస్తున్నారని అన్నారు. అబద్ధాలతో కాలం గడిపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పొన్నాల ఆరోపించారు.
కేసీఆర్, మోడీ ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రపంచంలో వ్యాక్సిన్ విషయంలో చాలా సాధించామని చెప్పుకుంటున్న మోడీ.. మొదటి వ్యాక్సిన్ వేసుకొని ప్రజలకెందుకు భరోసా ఇవ్వలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఒకే రోజు కోట్ల మందికి పోలియో చుక్కలు వేసి రికార్డ్ సృష్టించామని గుర్తు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2021 05:55PM