హైదరాబాద్ : తెలంగాణలో భూదాన్, చెర్వుశికం, ప్రభుత్వ భూముల అక్రమణలపై వేసిన శ్యాం ప్రసాద్ సిన్హా కమిటీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూదందాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. తక్షణమే సిన్హా కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కుంట, చెర్వుశికాలు, భూదాన్, సాన్‌మక్తా, పాయిగా లాంటి ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి శ్యాం ప్రసాద్ సిన్హా కమిటీని వేసింది. ఈ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఈ రెకమండేషన్స్ వల్ల మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ వాటి అమలులో జాప్యం వల్ల ఫలితాలను ప్రభుత్వం పొందలేకపోతున్నది. ప్రభుత్వ భూముల ఆక్రమణలో మాఫియాలు ప్రవేశించి కిడ్నాప్‌లు, హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రికార్డులు ఫ్యూరిపికేషన్ చేస్తున్నామని చెప్తున్నా పీవోబీ ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గత విచారణలో తేలిన ఎంఎంఆర్ ప్రాపర్టీస్, హిందు అరన్య లాంటివి ఏళ్ల తరబడి కోర్టుల్లోనే పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇటీవల హఫీజ్‌పేట భూదందా, కిడ్నాప్‌కు సంబంధించిన భూమి కూడా ప్రభుత్వానిదే అనే వార్తలొస్తున్నాయి.
ఒక ప్రక్క ప్రభుత్వ అవసరాలకు, డబుల్‌బెడ్రూమ్ ఇళ్లుకు మరియు ఇళ్ళ స్థలాలకు భూములు లేవంటూనే, భూబకాసురులను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ భూములను ప్రభుత్వం కాపాడగలిగితే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రావడంతో పాటు, హైదరాబాదుకు వస్తున్న కొత్త పరిశ్రమలకు, ప్రాజెక్టులకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు, పేదల ఇళ్ళ స్థలాలకు కావాల్సిన భూముల కొరత తీరుతుంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్యాం ప్రసాద్ సిన్హా కమిటీ నివేదికను అమలు చేసి, ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టి, ప్రజా సంక్షేమానికి తోడ్పడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2021 04:58PM