హైదరాబాద్ : రేపు సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకోనున్నారు.రిజర్వాయర్లో నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్ కు చేరుకోవడంతో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. బ్యారేజ్ పరిసరాల్లో అధికారులతో కలిసి సుమారు 4 గంటల పాటు పర్యటించి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ చేయనున్నారు. ఆ తరవాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm