హైదరాబాద్ : నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ గెలవక పోతే రాజకీయాలు గురించి మాట్లాడనంటూ వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఐకేపీ సెంటర్లు బంద్ పెడితే టిఆర్ఎస్ ఎంపీ, మంత్రులు ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని హెచ్చరించారు కోమటిరెడ్డి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వ తరహాలో.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ రాజీపడ్డా.. మేం వదిలిపెట్టె ప్రసక్తే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm