హైదరాబాద్ : పులిని చూస్తేనే మనం భయపడి వణికిపోతాం. అలాంటిది కూర్చున్న కారునే వెనక్కి లాగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ వీడియోలో సందర్శకులు కూర్చున్న కారును ఓ పులి తన నోటితో వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కారు డ్రైవర్ కారును రివర్స్ చేశాడు. దీంతో పులి.. కారును వెనక్కి లాగినట్టుగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్నాటకలోని బన్నేర్ ఘట్టా జాతీయ పార్కులో జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm