హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అమృత్‌సర్ నుంచి జయనగర్ వెళ్తున్న ప్రమాదవశాత్తు ఓ రైలు పట్టాలు తప్పింది. లక్నో డివిజన్‌లోని చార్‌బాగ్ స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితిని సమీక్షించారు. అయితే రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయని, వాటిలో 155 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్ఎం సంజయ్ త్రిపాఠి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm