న్యూఢిల్లీ: మణిపూర్, మహారాష్ట్రలో భూమి స్వల్పంగా కంపించింది. సోమవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌లో భూకంపం వచ్చింది. దీనితీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 2.7గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2.06 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చిందని తెలిపింది. కాగా, ఆదివారం రాత్రిపొద్దుపోయిన తర్వాత మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.5గా నమోదయ్యిందని ఎన్‌సీఎస్ తెలిపింది. రాత్రి 10.45 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని, భూఅంతర్భాగంలో 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm