హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ బైకు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన కోరపు అజిత్ కుమార్, పెంటల వెంకటేష్ ద్విచక్రవాహనంపై సిరిసిల్ల వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేములవాడలోని నంది కమాన్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీ కొట్టారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు సిరిసిల్లా ఏరియా దవాఖానకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm