హైదరాబాద్: మనస్తాపానికి గురైన జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. గోల్నాక చేపల మార్కెట్ సమీపంలోని ఖార్ఖాన గల్లీలో నివాసం ఉంటున్న వెంకటయ్య కుమారుడు కె.సిద్ధప్ప(45), జీహెచ్ఎంసీ మలేరియా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆయన పెద్ద కుమారుడు ఆరు నెలల కితం చనిపోగా, భార్య రాజేశ్వరికి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. డాక్టర్‌కు చూపిస్తే కేన్సర్ అని తేలింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధప్ప ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్న సతీష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm