హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్ కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ఆరు రాష్ట్రాల్లో 553 సెషన్స్ జరిగినట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 308, తమిళనాడులో 165, కర్ణాటక 64, అరుణాచల్ ప్రదేశ్‌లో 14, కేరళ, మణిపూర్‌లో ఒక్కో సెషన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ జరిగిన ఈ రెండు రోజుల్లో 447 ప్రతికూల సంఘటనలు నివేదించబడినట్లు వెల్లడించింది. కొవిడ్ టీకాల విషయంలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకరోజు టీకాల పంపిణీలో భారత్‌దే మొదటిస్థానం అని కేంద్రం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm