హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భైంసా మండలం సిరాల, పాంగ్రా గ్రామాల శివారులో ఆదివారం చిరుత పులి దాడిలో అడవి పంది మృతి చెందింది. సిరాల గ్రామశివారులో క్రషర్ పనులకు వెళ్లిన గ్రామస్తులు అడవి పంది కళేబరాన్ని గుర్తించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారి పీ గంగారంకు సమాచారం అందించగా, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించగా, చిరుతపులి పాదముద్రలు కనిపించినట్లు తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండగా నీటి కోసం వచ్చిన అడవి పందిపై అది దాడిచేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రజలెవరూ ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm