హైదరాబాద్: కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ రైల్వే అధికారి మహేంద్రసింగ్ను.. సీబీఐ అరెస్టు చేసింది. 1985 బ్యాచ్ ఐఆర్ఈఎస్ అధికారి మహేంద్ర సింగ్ చౌహాన్ ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టు కాంట్రాక్టులను మంజూరు చేసేందుకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాల నేపథ్యంలో.. నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ.. మహేంద్రసింగ్ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, అసోం, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm