సంగారెడ్డి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొండాపూర్ సీఐ శివలింగం కథనం మేరకు..అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో కంకోల్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారు జామున వాహనాల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకకు 143 క్వింటాళ్ల రేషన్ బియ్యన్ని తొమ్మిది వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకొని వాహనాలను సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మునిపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆర్‌ఐవో రవీందర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm