హైదరాబాద్: సీఎం కేసీఆర్ బందువులు ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, గుంటూరు శీను, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ పరారీలో ఉన్నారని వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని సీపీ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm