ములుగు: గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం చిన్న జాతర నిర్వహణ తేదీలను ఆలయ కమిటీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరగనుంది. ఈ సంవత్సరం చిన్న మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు ఆలయ కమిటీ, పూజారులు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో రేపటి నుంచి జాతర పనులు ప్రారంభంకానున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm