హైదరాబాద్ : గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే, ట్రెజరర్ కేజీ శంకర్ (71) ఈరోజు ఉదయం కన్నుమూసారు. పుదుచ్చేరికి చెందిన ఎమ్మెల్యే శంకర్.. ఇలాంగోనగర్‌లోని తన నివాసంలో ఉదయం నిద్రలేవగానే ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పారు. అనంతరం.. వారు ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే కన్నుమూశారు. కేజీ శంకర్‌కు భార్య, ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. 1950లో పుదుచ్చేరిలో జన్మించిన శంకర్.. 1984 నుంచి ఇప్పటివరకు బీజేపీ నాయకుడిగా కొనసాగారు. కాగా, శంకర్ మృతిపట్ల పుదుచ్చేరికి చెందిన రాజకీయ ప్రముఖులందరూ సంతాపం వ్యక్తంచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm