హైదరాబాద్ : పొగమంచు కారణంగా వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి నడిచే సుమారు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తర రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ సంగం - చండీగఢ్ స్పెషల్ ట్రైన్ (04217), గయా - న్యూఢిల్లీ స్పెషల్ (02397) రైళ్లు గరిష్ఠంగా 3.45 గంటలు ఆలస్యంగా నడస్తున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాజ్‌గిర్ టూ న్యూఢిల్లీ (02391) శ్రమజీవి ఎక్స్ ప్రెస్, హౌరా జేఎన్ రైల్వేస్టేషన్ - న్యూఢిల్లీ స్పెషల్ (02303), ఆజమ్‌గఢ్- ఢిల్లీ కైఫీయాత్ స్పెషల్ (02225), పాట్నా- ఢిల్లీ (02393) సంపూర్ణ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలకుపైగా ఆలస్యమయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే వీటితో పాటు మరికొన్ని ట్రైన్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm