హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్ల శివారులోని రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సిద్దన్నపేట గ్రామానికి చెందిన కడవ రామచంద్రం (45), ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన వానరాశి రమేష్(35)లుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm