హైదరాబాద్ : అతని పేరు గణేశ్. ఉండేది చెన్నైలో.. ఫేస్ బుక్ లో చూడటానికి అందంగా ఉంటాడు. లవ్లీ గణేశ్ పేరిట ఫేస్ బుక్ లో ఖాతాను తెరిచి, తన మాయమాటలతో అమ్మాయిలను లవ్ లో పడేసి, వారిని పెళ్లి చేసుకోవడమే ఇతని ప్రవృత్తి. ఒకరిని, ఇద్దరినీ కాదు. ఏకంగా 12 మందిని ఇలా పెళ్లాడాడు. 12వ భార్య ఇతని నిజ స్వరూపాన్ని కనుక్కొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.
వివరాల ప్రకారం.. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న గణేశ్(22), ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఇద్దరూ మేజర్లే కావడంతో వారు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. కొంతకాలం తరువాత గణేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి, తనకన్నా ముందు అతనికి 11 పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకుని షాక్ నకు గురైంది. 11 మందిని అతను మోసం చేశాడని, తాను 12వ దాన్నని తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించింది. ఆపై విచారించిన పోలీసులు గణేశ్ ను అరెస్ట్ చేసి, కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2021 11:59AM