హైదరాబాద్ : దేశంలో నమోదైన కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,144 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 17,170 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,57,985కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 181 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,274 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,01,96,885 మంది కోలుకున్నారు. 2,08,826 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm