హైదరాబాద్ : తమిళనాడు జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి జరిగింది. శివగంగై జిల్లా సిరావయల్‌లో జరిగిన జల్లికట్టు క్రీడల్లో.. ఎద్దులు పొడవడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు స్ధానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. జల్లికట్టు క్రీడలు ప్రారంభమైన గురువారం నుంచి ఇప్పటి వరకు.. అనేక మంది గాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm