#WATCH Chhattisgarh: #COVID19 vaccine was welcomed with flowers, band, firecrackers & 'puja' when it arrived in Jashpur y'day. Workers of Health Dept walked up to Jai Stambh Chowk to receive the vehicle that carried vaccine. #COVID19Vaccination is underway across India today. pic.twitter.com/v5G0M2kAPX
— ANI (@ANI) January 16, 2021
హైదరాబాద్ : ఏడాదిగా పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలే క్షణాలు రానే వచ్చాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కరోనా ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశం నలుచెరగులా వ్యాక్సిన్లు రవాణా చేశారు. కాగా, చత్తీస్ గఢ్ లోని జష్పూర్ లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. కరోనా వ్యాక్సిన్లను తీసుకువస్తున్న వాహనానికి ఘనస్వాగతం లభించింది. స్థానిక వైద్య, ఆరోగ్య వర్గాలు బాణసంచా కాల్చుతూ, డప్పు వాయిద్యాలు మోగిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో ఆ వాహనాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం ఆ వాహనానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.