నవతెలంగాణ-గుండాల
పోలీసు కావాలనుకుంటున్నారా.. అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఎస్ఐ ముత్యం రమేష్ అన్నారు. ఈ విషయమై శనివారం విలేకరులతో మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను పోలీస్ శాఖ ఆహ్వానిస్తోందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన రాష్ట్రస్థాయి ఫ్యాకల్టీ చేత ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. అందుకు గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఐ పోస్ట్ కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ మెమోలు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, కానిస్టేబుల్ కోసం టెన్త్, ఇంటర్ మెమో,కుల ధ్రువీకరణ పత్రం పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒకటితో.. ఆదివారం మధ్యాహ్నం 1 గంటల లోపు గుండాల పోలీస్ స్టేషన్ లో దరఖాస్తులు చేేేసుకోవాలని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 07:52PM