హైదరాబాద్ : ఏపీలో గత 24 గంటల్లో 25,542 కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటిలో 18,795 పరీక్షలను వీఆర్డీఎల్, ట్రూనాట్, నాకో విధానాల్లో నిర్వహించగా 6,747 పరీక్షలను రాపిడ్ యాంటీజెన్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షల్లో 114 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24, విశాఖపట్నంలో 22 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1 కేసు నమోదైంది. కడప జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 326 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,85,824 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,76,698 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్యల 1,987కి తగ్గింది.
Mon Jan 19, 2015 06:51 pm