హైదరాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో నేమిచంద్ జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున నేమిచంద్ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దుకాణం యజమాని వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. డ్రైవర్ తన స్నేహితులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడిన్నట్ట పోలీసుల విచారణలో అంగీకరించాడు. షాప్ వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించి నిందుతులు.. 1.20 కేజీల బంగారం, 302 గ్రాముల వెండి దోచుకెళ్లారు. చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతాన్నికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm