ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మాకంగా నిర్వహించే నాగోబా జాతరను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు మెస్రం వంశీయులు తీర్మానం చేశారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయం(మురాడి)లో కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించే నాగోబా జాతర పై చర్చించారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది జాతరను రద్దు చేయాలని మెస్రం వంశీయులు తీర్మానించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌పటేల్, పెద్దలు చిన్నుపటేల్ తీర్మాన వివరాలు వెల్లడించారు. అయితే కొవిడ్-19 నేపథ్యంలో కేవలం మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. నాగోబాకు మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతోపాటు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. జాతరతోపాటు ప్రజా దర్బార్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm