హైదరాబాద్: ఐఏఎస్ - 2019 బ్యాచ్ అధికారులకు వివిధ రాష్ట్రాల క్యాడర్‌ను కేటాయిస్తూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ - 2019 బ్యాచ్ లో మొత్తం 179 మంది అధికారులను కేటాయించగా అందులో తెలంగాణకు తొమ్మిది మందిని, ఆంధ్రప్రదేశ్‌కు 10 మందిని కేటాయించారు. రాష్ట్రానికి కేటాయించిన వారిలో ఇద్దరు తెలంగాణ వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన వారిలో ముగ్గురు ఏపీ వారు ఉన్నారు.
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ అధికారులు
మందా మకరందు (110 ర్యాంక్), బి.రాహుల్ (272 ర్యాంకు) తెలంగాణకు చెందిన వారు కాగా మయాంక్ మిట్టల్ (29 ర్యాంక్), అపూర్వ చౌహాన్ ఉత్తరప్రదేశ్, అభిషేక్ అగస్త్యా (38 ర్యాంక్) జమ్ము కశ్మీర్, అశ్విని తానాజీ వాంఖడే (200 ర్యాంక్) మహారాష్ట్ర, ప్రతిభాసింగ్ (386 ర్యాంక్) రాజస్థాన్, ప్రఫుల్ దేశాయ్ (532 ర్యాంక్) కర్ణాటక, కదిరవన్ (816 ర్యాంక్) తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఐఏఎస్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన పది మందిలో మల్లవరపు సూర్య తేజ (76 ర్యాంక్), తాటిమాకుల రాహుల్ కుమార్‌రెడ్డి (117 ర్యాంక్), కొల్లాబత్తుల కార్తీక్ (428) ఏపీ వారు కాగా గీతాంజలి శర్మ (32 ర్యాంక్) దిల్లీ, శుభం బన్సాల్ (43 ర్యాంక్) ఉత్తరాఖండ్, నూరుల్ ఖమర్ (252 ర్యాంక్) బిహార్, ఫర్మాన్ అహ్మద్ ఖాన్ (258 ర్యాంక్), అభిషేక్ కుమార్ (288 ర్యాంక్) హరియాణా, అదితి సింగ్ (411 ర్యాంక్) దిల్లీ, శోభిక ఎస్.ఎస్. (504 ర్యాంక్) తమిళనాడుకు చెందిన వారు.
ఇతర రాష్ట్రాలకు కేటాయించిన తెలంగాణ వారు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దిటి ధాత్రిరెడ్డి(46 ర్యాంక్)ని ఒడిశా, కట్టా రవితేజ (77 ర్యాంక్), బాణోత్ మృగేందర్ లాల్ (505 ర్యాంక్)లను తమిళనాడుకు కేటాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 07:37AM