ఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా ఎనిమిది కొత్త రైళ్లను ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం ఉన్న కెవాడియాను దేశవ్యాప్తంగా పలు స్టేషన్లకు అనుసంధానిస్తున్నారు. ఎనిమిది రైళ్లు కెవాడియాకు వారణాసి, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్, దాదర్, అహ్మదాబాద్ నుంచి నడువనున్నాయి. అలాగే దభోయ్, చందోద్, కెవాడియా మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌తోపాటు స్టేషన్ల కొత్త భవనాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు సమీపంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడుతాయని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రారంభించే రైళ్లు నర్మదా నది ఒడ్డున ఉన్న పురాతన, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతాయని చెప్పింది. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగై ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పీఎంఓ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 07:14AM