హైదరాబాద్:కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లో ఓ లారీ వేగంగా వచ్చి ఆగివున్న కారు, రెండు బైక్‌లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఈదులుగూడెం గ్రామానికి చెందిన మహేష్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపినందువల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm