- మోదుగులగూడెం గ్రామస్తులు.
నవతెలంగాణ-గుండాల
ఈ కల్వర్టులో నాణ్యత లేదు. గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుందని మోదుగులగూడెం గ్రామస్తులు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నవతెలంగాణ తో మాట్లాడారు. మండలంలోని మోదుగులగూడెం గ్రామం నుండి సజ్జలబోడు గ్రామానికి వెళ్లేందుకు నూతనంగా రహదారి నిర్మాణంతో పాటు కల్వర్టుల నిర్మాణం జరుగుతుందని, అందులో భాగంగానే రెండు గ్రామాల మధ్య గల అలుగు వర్రెపై నిర్మిస్తున్న కల్వర్టుకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.కంకర, ఇసుక ఎక్కువగా కలిపి సిమెంట్ తక్కువగా కలుపుతుండడంతో ఎర్రగా ఇసుక తేలినట్లు కనిపిస్తుందని, ఈ విషయమై కల్వర్టు కాంట్రాక్టర్ తో మాట్లాడితే మేం ఎక్కడైనా ఇలాగే చేస్తున్నాం, చేస్తాం మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని దురుసుగా మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని ముత్తాపురం సర్పంచు పూనెం సమ్మయ్య దగ్గరకు తీసుకపోగా సంబంధిత ఏఈ, జేఈ లకు సర్పంచు ఫోన్ ద్వారా విషయం చెప్పడంతో ఏఈ, జేఈ లు నిర్మాణంలో ఉన్న కల్వర్టును పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించినప్పటికి వినకపోవడంతో మిల్లర్ లో కలపిన మాల్ ను ఒక పక్కన పోసి చూడగా మొత్తం ఇసుక తేలడంతో ఇలా అయితే కుదరని, అన్ని కరెక్టు గా కలపాలని చెప్పారని, అయినప్పటికీ కాంట్రాక్టర్ తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టును నాణ్యతగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచు సమ్మయ్య, గ్రామస్తులు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 09:05PM